Chiranjeevi | గద్వాల జిల్లా మెగా ఫ్యాన్స్ చిరంజీవిపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఆగస్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా గద్వాల జిల్లాలో పెద్ద ఎత్తున చిరంజీవి జన్మదిన సంబురాలు మొదలయ్యాయి. గద్వాల జిల్లా పట్టణ అధ్యక్షుడు బోయ జమ్మన్న గారి అధ్వరంలో మూడు రోజుల ముందే చిరు బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గద్వాల పట్టణంలోని రాయచూరు రోడ్డు నోబుల్ హైస్కూల్ సమీపంలో 30 క్వింటాళ్ల ఉప్పు, లవంగాలతో 250 ఫీట్లు అడ్డం.. 400 ఫీట్లు పొడవుతో చిరంజీవి చిత్రాన్ని గీసి మెగా అభిమానాన్ని చాటుకున్నారు.
మెగాస్టార్ చిత్రాన్ని చూసి జోగులాంబ గద్వాల జిల్లా మెగా అభిమానులందరూ ఆనందం వ్వక్తం చేస్తూ.. చిరుకు అడ్వాన్స్ బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా అభిమాని, మున్సిపల్ కౌన్సిలర్ NB మురళి గారు హాజరయ్యారు. వీరితో పాటుగా మెగా అభిమానులు సిద్ధు, పరుశ, రఘు, రంగస్వామి, రవి, PSPK మరియు మెగా ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు.

