Kartikeya Interview | బెదురులంక 2012లో ఫుల్ ఎంటర్టైన్మెంట్.. కార్తికేయ ఇంటర్వ్యూ
Kartikeya Interview | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం బెదురులంక 2012 (Bedurulanka 2012). క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్టు 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో కార్తికేయ మీడియాతో చిట్ చాట్ చేశాడు. సినిమా గురించి కార్తికేయ ఏమన్నాడంటే..?
Kartikeya Interview | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం బెదురులంక 2012
(Bedurulanka 2012). క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టీజర్ క్యూరియాసిటీ రేకెత్తిస్తూ .. సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. బెదురులంక 2012 ఆగస్టు 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో కార్తికేయ మీడియాతో చిట్ చాట్ చేశాడు. సినిమా గురించి కార్తికేయ ఏమన్నాడంటే..?
బెదురులంక 2012 సినిమా మీ దగ్గరకెలా వచ్చింది..?
డైరెక్టర్ క్లాక్స్ అజయ్ భూపతి ద్వారా తెలుసు. రాంగోపాల్ వర్మ కాంపౌండ్‌లో ఈ ఇద్దరూ సహచరులు. కరోనా టైంలో క్లాక్స్ నాకు కథ చెప్పారు. 2012లో యుగాంతం గురించి చాలా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కథకు కనెక్ట్ అయ్యా. ప్రేక్షకులు చాలా మారిపోయారు. బెదురులంక 2012 చేయడానికి కథలో ఉన్న కొత్తదనం, పక్కా వినోదం కారణం.
డైరెక్టర్ కథను బిగ్ స్క్రీన్‌పైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారా..?
సాధారణంగా.. ఓ కమర్షియల్ కథను వింటున్నపుడు మా మైండ్స్‌లో కొన్ని విజువల్స్ తిరుగుతుంటాయి. కొన్ని సీన్లు కూడా బయటకు వస్తాయి.కానీ బెదురులంక 2012 విషయంలో అలాంటి రెఫరెన్స్‌లు ఏమీ కనిపించవు. ఈ సినిమా పూర్తిగా కొత్త పంథాలో ఉంటుంది. సినిమా చూసి చాలా సంతోషంగా ఫీలయ్యా. ఈ చిత్రంలో ఫుల్ ఎంటర్టైన్మెంట్తో సామాజిక సందేశం కూడా ఉంటుంది. ఈ చిత్రం ప్రజల్లో చిన్న మార్పునైనా తీసుకొస్తుందని ఆశిస్తున్నా.
మీ పాత్ర శివ గురించి ఏదైనా చెప్తారా..?
తనకు నచ్చినట్టు జీవించే వ్యక్తి శివ. సిటీలో గ్రాఫిక్ డిజైనర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి గ్రామానికి వస్తాడు. ఇతరులు తన గురించి
ఏమనుకుంటున్నారు..? తననెలా జడ్జ్ చేస్తున్నారనేది పట్టించుకోడు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుపోతాడు. తనకిష్టం లేకపోతే ఏ పనీ కూడా చేయడు.
నేహాశెట్టితో లవ్‌ట్రాక్ ఎలా ఉండబోతుంది..?
నేహాశెట్టి ఇందులో ప్రెసిడెంట్ కూతురిగా నటిస్తోంది. బెదురులంక గురించి అస్సలు తెలియని ఆమె శివతో ప్రేమలో పడుతుంది. శివ అందరిముందు ఆమెను ప్రపోజ్ చేసే ధైర్యమున్న వ్యక్తి. అయితే ఆమె మాత్రం భయంతో తన ఫీలింగ్స్‌ను శివకు చెప్పడానికి భయపడుతుంది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు చాలా క్యూట్‌గా ఉంటాయి. ఇద్దరి కెమిస్ట్రీ చాలా క్లీన్‌గా ఉంటుంది.
డెబ్యూ డైరెక్టర్.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా.. నిర్మాత సహకారం ఎలా ఉంది..?
కథ మొత్తం 2012లో బెదురులంక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఓ సన్నివేశంలో జనాలంతా పరుగులు పెట్టాల్సి ఉంటుంది. ఈ సీన్‌కు చాలా మంది కావాల్సి వచ్చింది. నిర్మాత బెన్నీ ముప్పనేని బడ్జెట్, క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. కథకు కావాల్సిన ప్రతీది మాకు అందించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా మణిశర్మను ఆయనే తీసుకొచ్చారు. నేహాశెట్టి పేరును సూచించింది కూడా ఆయనే. బెన్నీ ముప్పనేని బ్యానర్లో పనిచేయడం సంతోషంగా ఉంది.
బెదురులంక 2012 తర్వాత కొత్త సినిమా ఎందుకు ప్రకటించలేదు..?
స్క్రిప్టుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటున్నా. ఏ సినిమా ప్రకటించకున్నా.. చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నా. క్రైం కామెడీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఉండబోతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వం వహించబోతున్నాడు. మరో మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Personal Finance Tips | పొదుపే శ్రీరామరక్ష.. అప్పుల ఊబిలో పడకుండా ఉండేందుకు ఈ పొదుపు అలవాట్లు మొదలుపెట్టండి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ఎలిమినేషన్.. రోహిత్‌కు షాకిచ్చిన హౌస్ మేట్స్ ఓటింగ్..!
Teachers Dress Code | ఇకపై టీచర్లు జీన్స్, టీషర్టులు వేసుకోవద్దు.. బీహార్ సర్కార్ సంచలన ఆదేశాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

