సత్యం రాజేశ్, రియా సత్యదేవ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న సస్పెన్స్ హారర్ కామెడీ మూవీ ‘ఫ్రెండ్లీ ఘోస్ట్’. జి.మధుసూదన్‌రెడ్డి దర్శకుడు. విశ్వనాథ్.డి.కె నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. అందులో భాగంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని శనివారం విడుదల చేశారు. మంచు మనోజ్ ఈ పోస్టర్ని విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
ఈ సినిమా సాంగ్స్, టీజర్, ట్రైలర్ త్వరలోనే రానున్నాయని, అన్ని వర్గాలవారికీ నచ్చే సినిమా ఇదని మేకర్స్ తెలిపారు. వెన్నెల కిశోర్, సునీత మరసియర్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, మధునందన్, చమ్మక్ చంద్ర, 30ఇయర్స్ పృథ్వీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హారిజ్ ప్రసాద్, సంగీతం భీమ్స్, సమర్పణ: మాస్టర్ జియాన్స్, నిర్మాణం: సుచిన్ సినిమాస్ లిమిటెడ్.