Ravi Teja | సాధారణంగా కొన్ని కాంబినేషన్లలో సినిమాలు వస్తున్నాయంటే చాలు క్రేజ్ మామూలుగా ఉండదు. సినిమా ఎలా ఉండబోతుంది.. బాక్సాఫీస్ రికార్డులు ఏంటని లెక్కలేసుకోవడం మొదలుపెట్టేస్తుంటారు సినీ జనాలు. అలాంటి క్రేజీ కాంబోల్లో ఒకటి రవితేజ (Ravi Teja) -గోపీచంద్ మలినేని (Gopichand Malineni). ఈ ఇద్దరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ మార్క్‌ను చూపించాయి. డాన్ శీను, బలుపు మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. ఇక చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజాకు క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ సెకండ్ ఇన్నింగ్స్ అందించాడు గోపీచంద్ మలినేని.
రవితేజ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన క్రాక్.. మాస్ మహారాజా మార్కెట్ అమాంతం పెంచేసింది. ఎంతలా అంటే ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేసేంతలా. క్రాక్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు రవితేజ. ఈ టాలెంటెడ్ యాక్టర్‌కు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. రవితేజ- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో నాలుగో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయన్న అప్డేట్ మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది.
రవితేజ కోసం గోపీచంద్ మలినేని పవర్ ఫుల్ స్కిప్ట్ సిద్దం చేసి వినిపించాడట. ఇక కథ విన్న మాస్ మహారాజా సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పాడని ఇన్సైడ్ టాక్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందట. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే వీలైనంత త్వరగా ఈ ఇద్దరి కాంబో మళ్లీ సెట్స్‌పైకి వెళ్లడం దాదాపు ఖాయమైనట్టేనని తాజా అప్డేట్ ద్వారా అర్థమవుతోంది.