తెలుగు ఇండస్ట్రీపై దండయాత్రకు రెడీ అయిన తమిళ హీరోలు..
Tamil Heroes | చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ డబ్బింగ్ సినిమాల సందడి కనిపించబోతోంది. కారణం తెలియదు కానీ కొన్ని రోజులుగా డబ్బింగ్ సినిమాలు తెలుగులో పెద్దగా కనిపించడం లేదు. మొన్నీమధ్య విశాల్ సామాన్యుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమాకు నెగిటివ్ ఫలితం వచ్చింది. మొదటి రోజు సినిమాకు డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్స్ వేటలో బాగా వెనుకబడిపోయాడు విశాల్. ఇదిలా ఉంటే రాబోయే నెల రోజుల్లో తమిళ ఇండస్ట్రీ నుంచి భారీ సినిమాలు కొన్ని తెలుగులో విడుదల కానున్నాయి. అజిత్, సూర్య, విక్రమ్, విజయ్ లాంటి స్టార్ హీరోలు తమ సినిమాలతో టాలీవుడ్ పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు.
విక్రమ్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మహాన్ ఫిబ్రవరి10న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదల కానుంది. కొన్నేళ్లుగా సరైన విజయం లేని విక్రమ్‌కు ఈ సినిమా ఫలితం కీలకంగా మారింది. ఇందులో విక్రమ్ కొడుకు ధ్రువ్ కీలక పాత్రలో నటించాడు. లిక్కర్ సిండికేట్ నేపథ్యంలో మహాన్ సినిమా వస్తుంది. మరోవైపు ఫిబ్రవరి 24న అజిత్ హీరోగా నటించిన వాలిమై థియేటర్లలో విడుదల కానుంది. CH వినోద్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సంచలనాలు సృష్టించింది. ఇందులో టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించాడు.
మరోవైపు సూర్య హీరోగా నటించిన ET మార్చిలో విడుదల కానుంది. పాండిరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. రెండేండ్లుగా తన సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తూ వస్తున్న సూర్య చాలా గ్యాప్ తర్వాత థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఇక విజయ్ హీరోగా నటిస్తున్న బీస్ట్ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదిరింది, సర్కార్, విజిల్, మాస్టర్.. ఇలా తెలుగు, తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ బీస్ట్ సినిమాపై అంచనాలు బానే ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు తెలుగులో కూడా భారీగానే విడుదల కాబోతున్నాయి.
Read More :
సంచలన సినిమాల దర్శకుడితో రజినీ మూవీ.. ఈసారి హిట్ పక్కా!
తెలుగు దర్శకులు.. తమిళ హీరోలు.. రొంబ కాంబినేషన్ అప్ప..”
టాలీవుడ్‌పై తమిళ హీరోల దండయాత్ర..”
ఆ సంచలన సినిమా సీక్వెల్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న శంకర్ తనయుడు!
Kollywood hero Remuneration | హాట్ టాపిక్‌గా యువ హీరో రెమ్యునరేషన్..సినిమాకు రూ.35 కోట్లు..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kollywood
- suriya
- Tamil Heroes
- vijay
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

