The Paradise | నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise) నుంచి మేకర్స్ మరో అదిరిపోయే మాస్ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి “యెష నాగుల కట్ట మీద.. యేసె ఉయ్యాల”
సాంగ్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా లిరికల్ వీడియోను వదిలింది. పూర్తి లిరికల్ వీడియో సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అచ్చమైన తెలంగాణ జానపద బాణీలో సాగే ఈ పాటలో కీర్తి సురేష్ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చి నానితో కలిసి ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టారు. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం ఈ పాటకు మరింత ఊపునివ్వగా, జంగి రెడ్డి, ప్రభా తమ శక్తివంతమైన గొంతుతో పాడి ప్రాణం పోశారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఈ సాంగ్ ద్వారా అంచనాలు మరింత తారాస్థాయికి చేరాయి. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.