Mahesh Babu | గొప్ప మనసు చాటుకున్న మహేశ్‌బాబు.. తెలుగు రాష్ట్రాల సీఎంఆర్ఎఫ్కు రూ.కోటి విరాళం
Mahesh Babu | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ అతాలకుతలమయ్యాయి. భారీ వర్షాలకు వరద పోటెత్తింది. వరదకు తెలంగాణలోని ఖమ్మంతో పాటు ఏపీలోని విజయవాడ సహా పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరింది.
Mahesh Babu | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ అతాలకుతలమయ్యాయి. భారీ వర్షాలకు వరద పోటెత్తింది. వరదకు తెలంగాణలోని ఖమ్మంతో పాటు ఏపీలోని విజయవాడ సహా పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరింది. దీంతో జనమంతా ఉన్న ఇండ్లను వదిలి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటపడ్డారు. తినేందుకు సరైన తిండి, తాగేందుకు నీరు లేక అల్లాడుతున్నారు. మరో వైపు వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు టాలీవుడ్ నటీనటులు ముందుకువచ్చారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు రూ.50లక్షల చొప్పున రూ.కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు సైతం వరద బాధితులను ఆదుకునేందుకు తనవంతుగా రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రెండు రాష్ట్రాల సీఎంఆర్ఎఫ్కు రూ.50లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు వరద పరిస్థితిని నుంచి త్వరగా కోలుకోవాలని.. కష్ట సమయంలో సమాజానికి తమవంతుగా సహాయపడాలని ట్వీట్ చేశారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ రెండు రాష్ట్రాలకు రూ.50లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. అలాగే, డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ, ఎస్ నాగవంశీ రూ.50లక్షలు, హీరో జొన్నగడ్డల సిద్ధు రూ.15లక్షల చొప్పున, విశ్వక్సేన్ రూ.5లక్షల చొప్పున ప్రకటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏపీ సీఎం సహాయ నిధికి రూ.కోటి, అశ్వనీదత్ రూ.25లక్షలు, నటి అనన్య నాగళ్ల రూ.5లక్షలు విరాళం ప్రకటించారు.
In light of the floods impacting both the Telugu states, I am pledging a donation of 50 lakhs each to the CM Relief Fund for both AP and Telangana. Let’s collectively support the measures being undertaken by the respective governments to provide immediate aid and facilitate the…
— Mahesh Babu (@urstrulyMahesh) September 3, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

