ఆరడుగుల బుల్లెట్ ఎట్టకేలకు దిగుతుంది.. పాత సినిమాను కొత్తగా ఆదరిస్తారా..?

aaradugula bullet | ఒక్కోసారి అంతే మరి.. అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా కూడా పన్ను విరుగుద్ది.. గోపీచంద్ విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. ఈయన కెరీర్లో ఓ సినిమా చాలా ఇబ్బందులు పెడుతుంది. ఆ సినిమా పేరు ఆరడుగుల బుల్లెట్. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ సినిమా వచ్చి ఈ పాటికే 4 సంవత్సరాలు అయ్యుండేది. కానీ ఏం చేస్తాం.. కుదర్లేదంతే. నాలుగేళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ ఆ తర్వాత పూర్తిగా సినిమా విషయమే మరిచిపోయారు దర్శక నిర్మాతలు. నాలుగేళ్లుగా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్న ఈ చిత్రం ఇప్పుడు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయింది. ఈ సినిమాను భారీ క్యాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో నిర్మించాడు తాండ్ర రమేశ్. దాదాపు 18 కోట్లతో ఆరడుగుల బుల్లెట్ తెరకెక్కింది. ఈ చిత్రానికి వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఆరడుగుల బల్లెట్ సినిమాలో ప్రకాశ్ రాజ్, నయనతార లాంటి స్టార్ క్యాస్ట్ ఉంది.

అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్లు ఆరడుగుల బుల్లెట్ పరిస్థితి తయారైంది.ఈ చిత్రానికి చాలానే బకాయిలు ఉండేవి. సినిమా విడుదలైన తర్వాత సెటిల్ చేస్తానని నిర్మాత చెప్పినా బయ్యర్లు వినలేదు. దీంతో ఎన్నిసార్లు సినిమా విడుదలకు ప్లాన్ చేసినా వాళ్లు అడ్డుకున్నారు. దీనిపైనే ఇన్ని రోజులు రచ్చ జరిగింది. అయితే ఇన్ని రోజులకు ఓ క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేద్దామని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
గోపీచంద్ కు యాక్షన్ హీరోగా మంచి ఇమేజ్ ఉండటం.. నయనతార హీరోయిన్ కావడంతో ఈ సినిమాను మంచి రేటుకి తీసుకుంటామంటున్నాయి డిజిటల్ సంస్థలు. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ 15 కోట్లకు డీల్ కూడా మాట్లాడేసినట్లు తెలుస్తుంది. అయితే కొన్నేళ్ల కింద జీ వాళ్లకు ఈ చిత్ర శాటిలైట్, డిజిటల్ హక్కులు 8 కోట్లకు అమ్మేసినట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో వాళ్లు ఆరడుగుల బుల్లెట్ ఓటీటీ రిలీజ్‌కు అడ్డుతగులుతున్నారని వార్తలు వచ్చాయి. తమకు అమ్మిన తర్వాత ఇప్పుడు రేట్ ఎక్కువ వచ్చిందని ఇతరులకు ఎలా అమ్మేస్తారంటూ వాళ్లు నిలదీస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఎలాగోలా అన్నీ క్లియర్ చేసి అక్టోబర్ 8న విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆరడుగుల బుల్లెట్ సినిమా వస్తుంది. మొత్తానికి పాత సినిమాను కొత్తగా ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలిక.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sai dharam tej | హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ ట్వీట్.. ఆనందంలో ఫ్యాన్స్..
Gangavva: చిరంజీవికి తల్లిగా గంగవ్వ.. ఏ చిత్రంలోనో తెలుసా?
రిపబ్లిక్ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నా: నారా లోకేశ్
Maa elections | మా ఎన్నికలతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు : పేర్ని నాని
Ram Potineni | హీరో రామ్ పోతినేనికి గాయం
నా భర్త అలాంటి వాడే.. రాజీవ్ కనకాలపై సుమ కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో తెలంగాణ విద్యార్థులు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

