ఓ సినిమా భారీ విజయాన్ని సాధించిందనుకోండి.. ఇక అదే తరహా కథలు వరుసపెట్టి వస్తూంటాయి. ఈ మూస ధోరణి చిత్ర పరిశ్రమలో పరిపాటే. కొన్నాళ్లు కుటుంబ కథలు.. ఇంకొన్నాళ్లు ప్రేమకథలు… మరికొన్నాళ్లు యాక్షన్ కథలు.. అలాగే పీరియాడిక్ డ్రామాలు.. ఇలా అన్నమాట. కాలాలు మారినట్టుగా ధోరణలు మారుతూవుంటాయి. ఒకప్పటి పాత ట్రెండ్ ఉన్నట్టుండి కొత్త ట్రెండై కూర్చుంటుంది. ఇప్పటి కొత్త ట్రెండ్ కొన్నాళ్లకూ పాతదై పోతుంది. గత ఏడాది పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ సినిమా పవన్‌కల్యాణ్ కెరీర్లోనే భారీ వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. మరి ‘ఓజీ’ ప్రభావమో ఏమో కానీ.. ఇప్పుడు తెలుగు సినిమా దృష్టి నిదానంగా మాఫియా కథలవైపు మళ్లినట్టు కనిపిస్తున్నది. బడా హీరోలంతా మాఫియా డాన్లలా మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ వివరాల్లోకెళ్తే..
ఇక సుజిత్ దర్శకత్వంలో నాని నటించబోతున్న ‘బ్లడీ రోమియో’ సినిమా కూడా మాఫియా నేపథ్య చిత్రమేనని వినికిడి. ఓ స్టార్ హోటల్లో సాధారణ ఛెఫ్‌గా కనిపించే వ్యక్తి.. కథలోని కీలకమైన సందర్భంలో భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా దర్శనమిస్తాడట. దర్శకుడు సుజిత్ తనదైన శైలిలో ైస్టెలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట.
ఇవిగాక, మరికొన్ని మాఫియా కథలు కూడా త్వరలో రానున్నట్టు సమాచారం. చివరిగా చెప్పేదేంటంటే.. ట్రెండ్ ఏదైనా ఎమోషన్స్ మాత్రం కథల్లో పక్కాగా ఉండాల్సిందే. భావోద్వేగాలు లేని కథల్ని ఎంత భారీగా తీసినా రాణించవు. ఈ విషయాన్ని దృష్టితో పెట్టుకొని కథల్ని వండితే.. ట్రెండ్ ఏదైనా విజయాలు వాటంతట అవే వస్తాయి.