Shiraz Mehdi | చిన్న సినిమాల హక్కుల కోసం యుద్ధం తప్పదు: హీరో షిరాజ్ మెహదీ
Shiraz Mehdi | ‘ఓ అందాల రాక్షసీ’ సినిమా థియేటర్ల కేటాయింపు వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చిందని, ఇది కేవలం పోరాటం కాకుండా సినిమా పరిశ్రమలో ఒక యుద్ధమని ఆ చిత్ర హీరో, దర్శకుడు, నిర్మాత షిరాజ్ మెహదీ స్పష్టం చేశారు.
Shiraz Mehdi | ‘ఓ అందాల రాక్షసీ’ సినిమా థియేటర్ల కేటాయింపు వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చిందని, ఇది కేవలం పోరాటం కాకుండా సినిమా పరిశ్రమలో ఒక యుద్ధమని ఆ చిత్ర హీరో, దర్శకుడు, నిర్మాత షిరాజ్ మెహదీ స్పష్టం చేశారు. తమ చిత్రానికి థియేటర్లు కేటాయించకుండా కొందరు కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. ఒక సినిమాను కావాలని తొక్కేయడం అంటే అందులో పనిచేసిన వందలాది మంది కార్మికులు, కళాకారుల జీవితాలను ఛిన్నాభిన్నం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య ఒక్క ‘ఓ అందాల రాక్షసీ’ చిత్రానిది మాత్రమే కాదని, టాలీవుడ్లో చిన్న బడ్జెట్ సినిమాలన్నింటి భవిష్యత్తుకు సంబంధించిన పోరాటమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ ఫిల్మ్స్ సంస్థలకు లీగల్ నోటీసులు పంపించామని, ఫిల్మ్ ఛాంబర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఛాంబర్ అధ్యక్షుడు మారడంతో న్యాయపరమైన ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తోందని, ఈ ఇబ్బందుల వల్ల సినిమా ఆడియో, ఓటీటీ, శాటిలైట్, డబ్బింగ్, ఓవర్సీస్ హక్కులతో పాటు థియేటర్ల ద్వారా రావాల్సిన ఆదాయం కూడా తీవ్రంగా దెబ్బతింటున్నదని వాపోయారు. తెలంగాణ గడ్డపై తెలుగు చిత్ర పరిశ్రమ వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఫిల్మ్ ఛాంబర్ ఆధిపత్యం కొనసాగడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్న గడ్డపై, స్థానిక సినీ నిర్మాతలు, దర్శకులు, కళాకారులకు అన్యాయం జరగడాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన పరిణామాలను గుర్తుచేస్తూ, స్థానికులకు ప్రాధాన్యం దక్కేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా పలుమార్లు ఫిర్యాదు చేశామని, సమస్య తీవ్రత తెలిసినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అవసరమైతే తెలంగాణ వ్యాప్తంగా సినీ రంగానికి సంబంధించిన వర్గాలన్నింటినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, పరిస్థితి చేయి దాటితే తెలంగాణ బంద్‌కు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
ఇదే సమయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తీరుపైనే కాకుండా, యూట్యూబ్ మరియు ఈఎఫ్ఓ మాఫియా కార్యకలాపాలపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ప్రాణాలైనా పోవాలి లేదంటే తమ సినిమాకు సరైన పరిష్కారమైనా రావాలని, మంచి మాటలతో చెబితే వినని వారికి త్వరలోనే తమ సత్తా ఏమిటో చూపిస్తామని షిరాజ్ మెహదీ స్పష్టం చేశారు. ఇది మా ప్రాంతమని, తెలంగాణ హక్కుల కోసం, చిన్న సినిమాల మనుగడ కోసం ఎంత దూరమైనా వెళ్తామని తేల్చిచెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shiraz Mehdi | చిన్న సినిమాల హక్కుల కోసం యుద్ధం తప్పదు: హీరో షిరాజ్ మెహదీ
U-19 Asia Cup: ఆర్యావీర్ సెహ్వాగ్, లక్ష్య రాయిచందానీ హాఫ్ సెంచరీలు.. ఆసియా అండర్-19లో భారత్ బోణీ
Putta Madhukar | ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా కన్నీళ్లేనా? : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
AIADMK Leader Arrest | టీవీకే ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఎర.. ఏఐఏడీఎంకే నేత అరెస్ట్
మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. గాంధీభవన్‌కు చేరిన పంచాయితీ!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

