Fawad Khan | | పాకిస్థాన్ నటులపై భారత్‌లో నిషేధం.. ‘అబీర్ గులాల్’ సినిమాపై కేంద్రం బ్యాన్
Fawad Khan | పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ 9 ఏండ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. నటి వాణి కపూర్ తో కలిసి 'అబీర్ గులాల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫవాద్ ఖాన్. అయితే, పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ సినిమాను కేంద్రం బ్యాన్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే పాకిస్థాన్ నటులపై భారత్‌లో నిషేధం విధించినట్లు సమాచారం.
Fawad Khan | జమ్మూ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యటకులపై సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో కశ్మీర్లోయతోపాటు దేశంమొత్తం భగ్గుమంది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదిలావుంటే ఈ ఘటన అనంతరం పాకిస్థాన్‌కి చెందిన నటులపై భారత ప్రభుత్వం నిషేధం విధించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ 9 ఏండ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి వాణీకపూర్ (Vaani Kapoor), పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్(Fawad Khan) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అబీర్ గులాల్’(Abeer Gulal). ఈ సినిమా మే 09న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇందులో పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటిస్తుండడంతో మూవీని కేంద్రప్రభుత్వం బ్యాన్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే పాకిస్థాన్‌కి చెందిన నటులపై భారత్‌లో నిషేధం విధించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ మూవీ నుంచి రెండు పాటలను చిత్రయూనిట్ విడుదల చేయగా.. తాజాగా వాటిని యూట్యూబ్‌లో నుంచి మేకర్స్ తొలగించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

