Falaknuma Das | రీ రిలీజ్‌కి రెడీ అయిన ‘ఫలక్‌నుమా దాస్’
Falaknuma Das | టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం ఫలక్‌నుమా దాస్. ఈ సినిమాకు తానే దర్శకత్వం చేయడంతో పాటు కథానాయకుడిగా నటించాడు.
Falaknuma Das | టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం ఫలక్‌నుమా దాస్. ఈ సినిమాకు తానే దర్శకత్వం చేయడంతో పాటు కథానాయకుడిగా నటించాడు. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాగా.. 2019లో ప్రేక్షకుల ముందు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతోనే విశ్వక్ సేన్‌కి మాస్ కి దాస్ అనే టైటిల్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా వచ్చిన దాదాపు 6 ఏండ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 10న రీ రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది. సలోని మిశ్రా, హర్షితా గౌర్ హీరోయిన్లుగా నటించగా.. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటించాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఫలక్‌నుమా ప్రాంతంలోని దాస్ (విశ్వక్ సేన్) అనే యువకుడి లైఫ్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. దాస్ చిన్ననాటి నుంచే అతడి ఏరియాలో ఉన్న లోకల్ దాదా శంకర్(జీవన్)ను చూసి ఆదర్శంగా తీసుకుని అతడిలా అవ్వాలి అనుకుంటాడు. బాల్యంలోనే తన స్నేహితులతో కలిసి ఓ చిన్న గ్యాంగ్‌ను ఏర్పాటు చేస్తాడు. ఈ గ్యాంగ్‌కు శంకర్ సహకారం కూడా అందుతుంది. స్కూల్ రోజుల్లో శంకర్ గ్యాంగ్‌తో కలిసి తిరుగుతూ, సరదాగా జీవితాన్ని గడుపుతాడు. కాలేజీలో చేరిన తర్వాత దాస్ జీవితంలో ప్రేమ, గొడవలు మొదలవుతాయి. అయితే, ఈ సమయంలో దాదా శంకర్ రవి, రాజు అనే ఇద్దరు వ్యక్తుల చేతిలో హత్యకు గురవుతాడు.
శంకర్ మరణంతో దాస్ గ్యాంగ్ ఒంటరిగా మిగిలిపోతుంది. అప్పటి వరకు హాయిగా గడిచిన వీరి జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ఈ కష్టాల నుంచి బయటపడేందుకు వీరు కొత్త మార్గాలు వెతుకుతారు. ఈ క్రమంలోనే ఫలక్‌నుమాలో ఓ మటన్ షాప్‌ను ప్రారంభిస్తారు. దాస్ మంచిగా నడుస్తుండటం వలన అక్కడ వ్యాపారం చేస్తున్న రవి, రాజుల బిజినెస్ దెబ్బతింటుంది. దీంతో వీరిద్దరూ దాస్ గ్యాంగ్‌తో గొడవకు దిగుతారు. ఈ ఘర్షణలో ఏం జరిగింది. దాస్‌ని పోలీసులు ఎందుకు వెతుకుతుంటారు. టింక్ అనే వ్యక్తి వలన దాస్ లైఫ్‌లో జరిగిన పరిస్థితులేంటి అనేది ఈ సినిమా కథాంశం.
#FalaknumaDas is re-releasing in theatres on APRIL 10th💥 pic.twitter.com/jpWwt94M9w
— VishwakSen (@VishwakSenActor) April 4, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

