Sarangadhariya | అన్నింటికంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్.. రాజా రవీంద్ర సారంగదరియా ట్రైలర్
Sarangadhariya | రాజా రవీంద్ర (Raja Ravindra) లీడ్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ ‘సారంగదరియా’ (Sarangadhariya). పద్మారావు అబ్బిశెట్టి (డెబ్యూ)దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జులై 12న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ సారంగదరియా ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
Sarangadhariya | తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు నటుడు రాజా రవీంద్ర (Raja Ravindra). ఈ టాలెంటెడ్ యాక్టర్ లీడ్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ ‘సారంగదరియా’ (Sarangadhariya). పద్మారావు అబ్బిశెట్టి (డెబ్యూ)దర్శకత్వం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన సారంగదరియా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. జులై 12న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ సారంగదరియా ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
సున్తీ చేయించుకొని వచ్చావా.. అంటూ సాగే డైలాగ్‌తో మొదలైంది ట్రైలర్. అయినా కులమంటే రక్తం కాదు సార్.. పుట్టుకతో రావడానికి.. మనం చేసే పనే కులం సార్..అనే డైలాగ్‌తోపాటు మందు, సిగరెట్లు, పేకాట, బెట్టింగ్స్.. వీటన్నింటి కంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్.. అది మనకు తెలియకుండానే మనం రాజీపడి బ్రతికేలా చేసేస్తుంది. అది ఎంతవరకు అంటే.. నువ్వింతే ఇంతకు మించి నువ్వేం చేయలేవని డిసైడ్ చేసి నీకే బాసై కూర్చుంటుంది.. అంటూ రాజా రవీంద్ర చెప్తున్న సంభాషణలు అందరినీ ఆలోచింపజేసేలా సాగుతూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సారంగదరియా ట్రైలర్..
ఈ చిత్రాన్ని సాయిజా క్రియేషన్స్ పతాకం పై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. సమాజంలో పరువుగా బతికితే చాలు అనుకునే ఓ వ్యక్తికి తన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. వాటిని అధిగమించి ఆ తండ్రి ఏం చేశాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనే నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు ఇప్పటికే రిలీజైన టీజర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన అందుకోవా, నా కన్నులే అనే లిరికల్ సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్,శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు , విజయమ్మ , హర్షవర్ధన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సారంగదరియా టీజర్..
Read also :
Disha Patani | దిశా పటానీ టాటూ మిస్టరీ వీడింది.. ఇంతకీ ఏంటో తెలుసా..?
Darshan wife | ఆమె దర్శన్ భార్య కాదు.. పవిత్రాగౌడపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి
Saripodhaa Sanivaaram | ఇంతకీ నాని ఎటు వెళ్తున్నాడో.. సరిపోదా శనివారం సెకండ్ లుక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

