దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలపై దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా ఆయనకు సరైన సక్సెస్‌లు రావడం లేదు. మరోవైపు భారతీయుడు సమస్యలు చుట్టుముట్టాయి.వీటన్నింటిని పరిష్కరించుకొని రామ్ చరణ్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు శంకర్.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుండగా, డిసెంబర్ నుండి ఈ ప్రాజెక్ట్ మొదలు కానుందని తెలుస్తుంది.
శంకర్ – రామ్ చరణ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి పాపులర్ క్యాస్ట్ అండ్ క్రూని ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే కైరా అద్వానీని కథానాయికగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు.ఇక జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించనున్నట్టు స్పష్టం చేశారు. విలన్‌గా మలయాళ హీరో ఫహద్ ఫాజిల్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.శంకర్ సినిమాల్లో హీరోతో పోటీగా ప్రతినాయకుల పాత్రలుంటాయి. ఈ సినిమాలోనూ బలమైన క్యారెక్టరైజేషన్ ఉండబోతోందని,చరణ్‌కి ప్రతినాయకుడిగా ఫాజిల్ అయితే బాగుంటుందని టీం భావించిందట.
ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరిపారని, కాల్షీట్స్ అడ్జెస్ట్ అయితే అఫీషియల్‌గా ప్రకటిస్తారని సమాచారం.ఇప్పటికే ఫహద్ ఫాజిల్ .. తెలుగులో బన్నీ నటిస్తున్న పుష్పలో విలన్‌గా నటిస్తున్నాడు.ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో తాను పోషిస్తున్న పాత్రను ప్రతిబింబించేలా ఓ క్యాప్షన్‌తో పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘చెడు చూడటానికి ఎప్పుడూ ప్రమాదకరంగా కనిపించదు. హ్యాపీబర్త్‌డే ఫహద్ ఫాజిల్’ అని కేవలం ఫహద్ కన్ను చిత్రాన్ని మాత్రమే పోస్టర్‌పై ఉంచారు.