మలయాళ చిత్రసీమలో విలక్షణ హీరోగా పేరు తెచ్చుకున్నారు జాతీయ అవార్డు గ్రహీత ఫహాద్ ఫాజిల్. ప్రధాన స్రవంతికి భిన్నమైన కథాంశాల్ని ఎంచుకోవడంతో పాటు సహజమైన నటనతో విమర్శకుల్ని మెప్పిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో ఆయన ‘పుష్ప’ చిత్రం ద్వారా ప్రతినాయకుడిగా అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్న కథానాయిక. క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమాలో భన్వర్‌సింగ్ షెకావత్ అనే ఐపీఎస్ అధికారిగా ఫహాద్ ఫాజిల్ కనిపించబోతున్నారు. ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. ‘ఈవిల్ వాజ్ నెవర్ సో డేంజరస్’ అనే స్టేట్మెంట్తో కనిపిస్తున్న ఫస్ట్‌లుక్ పోస్టర్లో ఫహాద్‌ఫాజిల్ శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: రామకృష్ణ-మోనిక, సాహిత్యం: చంద్రబోస్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, సహనిర్మాత: ముత్తంశెట్టి మీడియా, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై. రవిశంకర్, సీఈఓ: చెర్రీ, లైన్ ప్రొడ్యూసర్: కెవీవీ బాలసుబ్రహ్మణ్యం, దర్శకుడు: సుకుమార్.