రెట్టింపు వినోదం గ్యారెంటీ
క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు ప్రగతి. ఏ పాత్రలోనైనా తనదైన శైలి నటనతో మెప్పిస్తుంది. తాజాగా ‘ఎఫ్-3’ చిత్రంలో కీలక పాత్రలో నటించిందామె. వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలకానుంది
క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు ప్రగతి. ఏ పాత్రలోనైనా తనదైన శైలి నటనతో మెప్పిస్తుంది. తాజాగా ‘ఎఫ్-3’ చిత్రంలో కీలక పాత్రలో నటించిందామె. వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రగతి మాట్లాడుతూ “ఎఫ్-2’కు కొనసాగింపుగానే సీక్వెల్లో నా క్యారెక్టర్ ఉంటుంది. అయితే కథ మారింది కాబట్టి నా పాత్ర కొంచెం మార్పులతో కనిపిస్తుంది. ఈ సినిమాలో చక్కటి నటనతో పాటు హాస్యాన్ని పండించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.
వరుణ్‌తేజ్ ఏ విషయాన్నైనా త్వరగా ఆకళింపు చేసుకుంటారు. ఇక వెంకటేష్ సెట్లోకి రాగానే సినిమా మూడ్‌లోకి వెళ్లిపోతారు. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరైన దిల్‌రాజు సంస్థలో నటించడం ఆనందంగా ఉంది. సునీల్, అలీ ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి డబుల్ డోస్ వినోదం గ్యారెంటీ అని చెప్పొచ్చు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రతి సినిమాలో కొత్తదనాన్ని చూపించాలని ప్రయత్నిస్తున్నా. ‘ఎఫ్-2’ కంటే రెట్టింపు వినోదంతో ‘ఎఫ్-3’ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మంచి తారాగణం కుదిరింది కాబట్టి సినిమా అంతా ఓ పండగలా అనిపిస్తుంది. ఓ ఆహ్లాదకరమైన సినిమా చూశామని ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Actress
- entertainment
- f3
- movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

