SPY Movie | స్పై ప్రివ్యూ.. ఇది కొడితే నిఖిల్ దశ తిరిగినట్టే..!
SPY Movie | ఎందుకో తెలియదు కానీ చాలా హడావిడిగా వచ్చేస్తుంది నిఖిల్ స్పై సినిమా. దీనిపై ముందు నుంచి ఉన్న అంచనాలు వేరు.. కానీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్ లేకుండా విడుదలవుతున్న తీరు చూస్తుంటే ఎక్కడో చిన్న అసంతృప్తి అయితే కచ్చితంగా కలుగుతుంది.
SPY Movie | ఎందుకో తెలియదు కానీ చాలా హడావిడిగా వచ్చేస్తుంది నిఖిల్ స్పై సినిమా. దీనిపై ముందు నుంచి ఉన్న అంచనాలు వేరు.. కానీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్ లేకుండా విడుదలవుతున్న తీరు చూస్తుంటే ఎక్కడో చిన్న అసంతృప్తి అయితే కచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఇంత మంచి సినిమాను ఎక్కువ ప్రమోట్ చేసుకొని విడుదల చేస్తే బాగుంటుంది అనేది హీరో నిఖిల్ భావన కూడా. కాకపోతే నిర్మాతలు ముందుగానే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయడంతో ఎలాంటి మార్పు చేయకుండా.. హీరో మాట కూడా వినకుండా తక్కువ ప్రమోషన్తోనే స్పై సినిమాను విడుదల చేస్తున్నారు. దానికి తోడు ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లోనూ ఒకేరోజు విడుదలవుతుంది.
కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్ సినిమాల మీద మిగిలిన ఇండస్ట్రీల్లో కూడా ఆసక్తి బాగానే ఉంది. పైగా ఈయన ఎంచుకుంటున్న కథలు కూడా అలాగే ఉంటున్నాయి. కార్తికేయ 2లో శ్రీకృష్ణుడు సీక్రెట్ చెప్పిన నిఖిల్.. ఈసారి సుభాశ్ చంద్రబోస్ ఎలా చనిపోయాడు అనే విషయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ అనేది దీనికి క్యాప్షన్. అంటే ఇన్ని రోజులు దాచిపెట్టిన విషయాన్ని మా సినిమాలో చూపిస్తాం అనేది దీని అర్థం. అసలు స్పై సినిమాలో ఎలాంటి నిజాలు చూపించి ఉంటారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే టెక్నికల్గా ఈ సినిమా చుట్టేసినట్టు ఉంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే టైం ఎక్కువగా లేకపోవడంతో ఉన్న టైంలోనే సినిమాను వేగంగా పూర్తి చేశారు. దానికి తోడు ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ఎక్కువగా చేయలేదు.
కేవలం పది రోజుల్లోనే అంతా హడావిడిగా స్పై సినిమాను విడుదల చేస్తున్నారు. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమా. దీనికి 18 కోట్ల బిజినెస్ జరిగింది. సినిమా సేఫ్ అవ్వాలంటే 20 కోట్ల షేర్ రావాలి. కార్తికేయ-2 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు స్పై సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఇది పెద్ద విషయం కాదు. ఎందుకంటే నిఖిల్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో స్పై హిట్ అయిందంటే మాత్రం ఈయన రేంజ్ మరింత పెరగడం ఖాయం. మరీ ముఖ్యంగా హిందీలో క్లిక్ అయితే కలెక్షన్ల సునామి సృష్టించడం అయితే పక్కా. ఎడిటర్ గ్యారి బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ట్రైలర్ చూస్తుంటే ఇందులో విషయం బాగానే ఉందనే విషయం కూడా అర్థమవుతుంది. కాకపోతే సినిమా ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. టెక్నికల్ గా సౌండింగ్ లేకపోతే సినిమా రిజల్ట్ పై అది ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి దాన్ని దాటుకొని నిఖిల్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాడు అనేది చూడాలి.
Read More :
Ramcharan | రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాపై ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.. షూటింగ్ ఎప్పుడంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

