‘త్రివిక్రమ్‌గారు ఓ వేడుకలో మాట్లాడుతూ ‘మామూలు కథనే బలంగా చెప్పాలి. ఎలాంటి మలుపులు, రక్తపాతాలు లేకుండా ఆ కథ గొప్పగా ఉండాలి’ అని చెప్పారు. ఆ తరహా ప్రేమకథే ‘ఎపిక్” అన్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదిత్యహాసన్ దర్శకుడు. ఈ సందర్భంగా బుధవారం ఆనంద్ దేవరకొండ విలేకరులతో ముచ్చటించారు.