Pavan kalyan | ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది. స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ పురుష : (Purushaha) సినిమాతో సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాడు పవన్ కళ్యాణ్. వీరు ఉలవల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో పవన్‌కల్యాణ్ హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రం మే 22న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా విశేషాలు షేర్ చేసుకున్నాడు పవన్ కల్యాణ్.
నన్ను హీరో చేయాలన్నది మా నాన్న కల. అయితే మా కాలేజీలో సినిమా ఈవెంట్లు జరుగుతుండేవి. నాక్కూడా సినిమాలంటే చాలా ఇష్టం. మా నాన్నకు కూడా నన్ను హీరో చేయాలనే ఆశ ఉండటంతో ఇటు వైపు వచ్చానన్నాడు. సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నా. సార్ ఉండే కమ్యూనిటీలోనే నేను కూడా ఉన్నా. 4 నెలలు ఆయనతో ఉన్నా. సత్యానంద్ శిక్షణ మాత్రమే ఇస్తారు. ఎలాంటి రిఫరెన్సులు చేయరు. ఆయన వద్ద నేను ఎంతో నేర్చుకున్నానన్నాడు పవన్ కల్యాణ్.
నేను చాలా ఇంట్రావర్ట్‌గా ఉండేవాడిని. నన్ను కంఫర్ట్ జోన్ నుంచి వీరు డైరెక్టర్ వీరు (వులవల)అన్న బయటకు తీసుకొచ్చారు. ఆయన ఇచ్చిన సహకారంతోనే సినిమాను బాగా చేయగలిగా. పురుష : చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. ప్రతీ సీన్‌ను చాలా జాగ్రత్తగా చేశాం. ఈ జర్నీలో నాకు సినిమా ఆర్టిస్టుల కష్టాలన్నీ తెలిశాయన్నాడు. నా ఫ్రెండ్స్ ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేయాలని సలహా ఇస్తుంటారు. కానీ ఏ జోనర్లో సినిమా చేసినా కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలన్నది నా లక్ష్యమన్నాడు పవన్ కల్యాణ్.
ఈ చిత్రంలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులున్నారు. వారంతా నాకు చాలా సపోర్ట్‌గా నిలిచారు. ప్రత్యేకించి సప్తగిరి అన్న, కసిరెడ్డి అన్న ప్రతీ ఒక్కరి విషయంలో సాయం చేశారు. నెక్ట్స్ చేయబోయే మూవీ గురించి మాట్లాడుతూ ఈ సినిమా విడుదలైన తర్వాత కొత్త ప్రాజెక్టు గురించి ఆలోచిస్తానన్నాడు పవన్ కల్యాణ్.