Peddi Trailer | పెద్ది ఏమైనా దేవుడి పేరా..? నా ఫేవరేట్ క్రికెటర్, రెజ్లర్, రన్నర్.. స్టన్నింగ్‌గా రాంచరణ్ పెద్ది ట్రైలర్
Peddi trailer | రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం పెద్ది (Peddi). ఈ మూవీ జూన్ 4న 2026 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
Peddi Trailer | గ్లోబర్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం పెద్ది (Peddi). స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రానికి ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ జూన్ 4న 2026 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవరేట్ ప్లే ఆట మారుతుంది కానీ ఫేవరేట్ ప్లేయర్ (ఆటగాడు) మారడం లేదు.. అంటూ బొమన్ ఇరానీ చెబుతున్న డైలాగ్స్‌తో షురూ అయింది ట్రైలర్. పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా.. అంటే నా ఫేవరేట్ క్రికెటర్ పెద్ది సార్.. నా ఫేవరేట్ రెజ్లర్ పెద్ది సార్.. నా ఫేవరేట్ రన్నర్ పెద్ది సార్.. ఈ కుర్రాళ్లకు ఫేవరేట్ గుడిలో దేవుడు కాదు.. గ్రౌండ్లో దేవుడు. ఆటే నా పొగరు.. అంటూ రాంచరణ్ చెబుతున్న డైలాగ్స్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి.
ఆ తర్వాత హీరోయిన్ జాన్వీకపూర్ ఎంట్రీ ఇవ్వడం.. ఆకాశంలో నుంచి చుక్కలు రాలిపడతాయంటారు కా కదా.. ఓ చుక్కమైనా విజయనగరంలో ఈ పూట రాలిపడినాదేంటి రా.. అంటూ స్నేహితుడిని అడుగుతూ కొత్త యాసలో సాగుతున్న రాంచరణ్ డైలాగ్స్ థియేటర్లలో అభిమానులు, మూవీ లవర్స్‌కు సరికొత్త అనుభూతిని అందించబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తున్నాయి. క్రికెట్, రిజ్లింగ్, రన్నింగ్.. ఇలా మల్టీ స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చాడు డైరెక్టర్. నాకు ఆట గెలవడం కాదు.. బతకడం కావాలి.. అంటూ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టేస్తున్నాడు.
పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పెద్ది చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
Read Also :
Watch: గన్ గురిపెట్టి జ్యుయలరీ షాపులో దోపిడీకి యత్నం.. సిబ్బంది ఏం చేశారంటే?
Road accident | రోడ్డు పక్కన రాతి గోడను డీకొట్టిన కారు.. ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం
జూలూరుపాడులో ఘనంగా ‘టూ కే రన్’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

