Emergency Movie Teaser | బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్, బయోపిక్ సినిమాలకే ఓటేస్తుంది. మణికర్ణిక, తలైవి, ధడక్ ఇలా బ్యాక్ టు బ్యాక్ మహిళా ప్రధాన చిత్రాలతో దూసుకుపోతుంది. రిజల్ట్ ఎలా ఉన్నా ఈ బ్యూటీ జోరు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఇదే తరహాలో ఎమర్జెన్సీ అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో కంగనా ఇందిరా గాంధీ పాత్ర పోషించింది. ఇప్పటికే లీకైన ఈమె లుక్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను కంగనా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తుంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ టీజర్‌ను రిలీజ్ చేసింది.
లేటెస్ట్గా రిలీజైన టీజర్ మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. సినిమాలో 1975వ నాటి ఎమర్జెన్సీ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నట్లు టీజర్‌తో స్పష్టమైంది. ఇక కంగనా రనౌత్ ట్విట్టర్లో ‘సంరక్షకురాలా, లేక నియంతా? మన దేశ నేత తన ప్రజలపైనే యుద్ధం ప్రకటించి నాటి రోజుల చీకటి చరిత్ర ఇది. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 24న ఎమర్జెన్సీ విడుదల కానుంది అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు నిర్మాత కూడా కంగనానే కావడం విశేషం.
ప్రస్తుతం కంగనా చంద్రముఖి సీక్వెల్లో నటిస్తుంది. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు పి. వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే టాకీ పార్టు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా గడుపుతుంది.
A protector or a Dictator? Witness the darkest phase of our history when the leader of our nation declared a war on it’s people.
🔗 https://t.co/oAs2nFWaRd#Emergency releasing worldwide on 24th November pic.twitter.com/ByDIfsQDM7
— Kangana Ranaut (@KanganaTeam) June 24, 2023