విజయ్‌రాజ్ కుమార్, నేహా పఠాని జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏం చేస్తున్నావ్’. భరత్ మిత్ర దర్శకుడు. నవీన్ కురవ, కిరణ్ కురవ నిర్మాతలు. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల కథానాయకుడు శ్రీవిష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ఏం చేస్తున్నావ్ అనేది నా జీవితంలో ఎక్కువగా వున్న ప్రశ్న. ఈ ప్రశ్నలో చాలా అర్థాలుంటాయి.
ఈ టైటిల్, ఈటీమ్‌ను చూస్తుంటే నాకు నా సినిమాలు బ్రోచేవారెవరు, మెంటల్ మదిలో సినిమాలు గుర్తుకొస్తున్నాయి. కొత్తకాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఈ సమావేశంలో చిత్రబృందంతో పాటు పలువురు అతిథులు పాల్గొన్నారు.