Pawan Kalyan | పవన్‌కల్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 2న ‘ఓజీ’ ట్రైలర్..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పాలనాపరమైన విధులతో బిజీగా ఉండటంతో పవన్‌కల్యాణ్ తాజా చిత్రాలు ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహరవీరమల్లు షూటింగ్స్ అన్నీ వాయిదా పడ్డాయి. తాజాగా ఈ చిత్రాలను వరుసగా పూర్తి చేసేందుకు పవన్‌కల్యాణ్ సమాయత్తమవుతున్నారు. త్వరలో ఆయన ‘హరిహర వీరమల్లు’ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు.
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పాలనాపరమైన విధులతో బిజీగా ఉండటంతో పవన్‌కల్యాణ్ తాజా చిత్రాలు ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహరవీరమల్లు షూటింగ్స్ అన్నీ వాయిదా పడ్డాయి. తాజాగా ఈ చిత్రాలను వరుసగా పూర్తి చేసేందుకు పవన్‌కల్యాణ్ సమాయత్తమవుతున్నారు. త్వరలో ఆయన ‘హరిహర వీరమల్లు’ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఓజీ’ సినిమా అప్డేట్ గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను పవన్‌కల్యాణ్ జన్మదినమైన సెప్టెంబర్ 2న విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుడా పోయాయి.
త్వరలో ‘ఓజీ’ షూటింగ్ కూడా మొదలుకానున్నట్లు తెలిసింది. ఇప్పటికే 60శాతం చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో షూటింగ్‌ను పునఃప్రారంభిస్తారని, నాయకానాయికలు పవన్‌కల్యాణ్, ప్రియాంక మోహన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని సమాచారం. సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ‘ఓజీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్‌దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్‌రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

