విశ్వక్సేన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’. ఈ సినిమా ఇటీవల ఆహా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందుతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆహా కంటెంట్ హెడ్ వాసు మాట్లాడుతూ…‘విశ్వక్సేన్ ‘దాస్ కా ధమ్కీ’ మా ఓటీటీలో మంచి ఆదరణ పొందుతున్నది.
ఆయన గత సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ కూడా ఆహా టాప్ త్రీలో ఉంది. ‘ఓరి దేవుడా’ కూడా విజయవంతమైంది. విశ్వక్సేన్తో మా ఓటీటీ ఓ సరికొత్త ప్లాన్ చేస్తున్నది. దాని గురించి త్వరలో ప్రకటన చేస్తాం’ అన్నారు. విశ్వక్సేన్ మాట్లాడుతూ…‘మా చిత్రాన్ని ఆహా బాగా ప్రమోట్ చేస్తున్నది. ఐపీఎల్ సాగుతున్నప్పటికీ మా సినిమాను ప్రేక్షకులు చూస్తున్నారు. వచ్చే ఏడాది ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకు సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక నివేదా పేతురాజ్ పాల్గొన్నారు.