Dunki Movie | షారుఖ్ ‘డంకీ’ పోస్ట్ పోన్‌పై మేకర్స్ క్లారిటీ.. ఆ వార్తలు ఫేక్
Dunki | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటిస్తున్న మోస్ట్ ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్ డంకీ (Dunki). మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం సలార్. ఈ రెండు సినిమాలు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానున్నాయి.
Dunki | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటిస్తున్న మోస్ట్ ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్ డంకీ (Dunki). మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం సలార్. ఈ రెండు సినిమాలు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానున్నాయి. అయితే ప్రభాస్ సలార్ (Salaar) రిలీజ్ నేపథ్యంలో డంకీ (Dunki) విడుదల వాయిదా వేయాలని షారుఖ్‌ఖాన్ టీం ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో ఉదయం నుంచి చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన షారుఖ్ అభిమానులు ఈ వార్త నిజమేమో అని తెగ బాధపడ్డారు. అయితే ఈ రూమర్స్‌పై తాజాగా డంకీ టీం క్లారీటి ఇచ్చింది.
సోషల్ మీడియాలో డంకీ మూవీ విడుదల వాయిదా అని వస్తున్న వార్తలు నిజం కావని, ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మవద్దని తెలిపింది. ముందు చెప్పినట్లుగానే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న డంకీ విడుదల అవుతుందంటూ ప్రముఖ ఇండియన్ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. త్వరలోనే డంకీ టీజర్ రానున్నట్లు ప్రకటించారు. ఇక ఈ ఏడాది పఠాన్‌తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏంటో చూపించాడు బాద్ షా. ఈ సారి మరోసారి జవాన్ సినిమాతో రూ.1000 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు.
SRK – ‘DUNKI’ NOT POSTPONED… Yes, #Dunki is arriving on #Christmas2023… #DunkiTeaser releasing soon! #SRK #RajkumarHirani pic.twitter.com/kDShzPoRTu
— taran adarsh (@taran_adarsh) October 13, 2023
రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డంకీ’ చిత్రంలో తాప్సీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సలార్ రెండు పార్టులుగా రాబోతుండగా.. పార్టు 1 డిసెంబర్ 22న సందడి చేయనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 20 మంది ప్రయాణికులకు గాయాలు..!
Psoriasis | సోరియాసిస్, ఎగ్జిమా.. రెండింటి మధ్య తేడాలేమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..?
Sharukh Khan | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. ‘కింగ్’ నుంచి తొలి పాట విడుదల, రొమాన్స్‌తో పాటు యాక్షన్ అదుర్స్
BRS | హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ధర్నా
Stock Markets | దిగివచ్చిన ముడిచమురు ధరలు.. ఏకంగా వెయ్యికిపైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

