Dulquer Salmaan Enters 50Crore Club | ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు దుల్కర్ సల్మాన్. ఆ తర్వాత ‘మహానటి’తో నేరుగా తెలుగులోనే నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇటీవలే విడుదలైన ‘సీతారామం’తో తెలుగులో తన మార్కెట్‌ను భారీగా పెంచుకున్నాడు. ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. విడుదలైన వారంలోపే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. ఈ చిత్రంలో దుల్కర్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈయన అరుదైన ఘనతను సాధించాడు.
‘సీతారామం’ చిత్రం తాజాగా 50కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. దాంతో టాలీవుడ్లో 50కోట్ల క్లబ్లో చేరిన మొదటి మాలీవుడ్ హీరోగా దుల్కర్ రికార్డు సృష్టించాడు. ఒక మాలీవుడ్ హీరోకు ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయంటే విశేషం అనే చెప్పాలి. టాలీవుడ్లో ఇప్పటికీ కొంత మంది హీరోలు యాభై కోట్ల మార్క్‌ను టచ్ చేయాలని ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంతో దుల్కర్ టైర్2 హీరోల ప్లేస్‌లో చోటు దక్కించుకున్నాడు.
హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ అందమైన ప్రేమకావ్యాన్ని వైజయంతి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించాడు. ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించాడు. దుల్కర్‌కు జోడీగా మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటించింది. రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కీలక పాత్ర పోషించింది. నటుడు సుమంత్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రల్లో నటించారు.
The love is unstoppable 💖#SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @DQsWayfarerFilm @LycaProductions @RelianceEnt @SonyMusicSouth pic.twitter.com/z92y7tzWnr
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 15, 2022