డబుల్ మ్యూజికల్ హంగామా
రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్' మ్యూజిక్ హంగామాకు రెడీ అయ్యింది. ‘ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్‌గా దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ మ్యూజిక్ హంగామాకు రెడీ అయ్యింది. ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 15న సినిమా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని ‘స్టెప్పా మార్..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ని జూలై 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇందులో భాగంగా శివుడి విగ్రహం ముందు మాస్ డాన్స్ చేస్తున్న రామ్ పోస్టర్ని రిలీజ్ చేశారు. భాస్కరభట్ల సాహిత్యం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, రామ్ పోతినేని డాన్స్ మూమెంట్స్ ఈ పాటకు హైలైట్స్‌గా నిలుస్తాయని, మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రంలోని పాటలు మాస్ ప్రేక్షకులను అలరిస్తాయని మేకర్స్ తెలిపారు.
కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్ విలన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అలీ, గెటప్‌శ్రీను తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: సామ్ కె.నాయుడు, జియాని జియాన్నెలి, నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్, నిర్మాణం: పూరీ కనెక్ట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

