శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాలేజ్ డాన్’. శిబి చక్రవర్తి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. నిర్మాత ఎన్వీప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ సందర్భంగా ఇటీవల థాంక్స్‌మీట్‌ను నిర్వహించారు. శివ కార్తికేయన్ మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులకు మంచి ఆదరణ కనబరుస్తున్నారు. వినూత్న కథాంశంతో సినిమా ఆకట్టుకుంటున్నది.
ఈ సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి. ప్రస్తుతం దర్శకుడు అనుదీప్‌తో తెలుగు సినిమా చేస్తున్నా. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో తప్పకుండా తెలుగులోనే మాట్లాడుతా’ అన్నారు. ఎన్వీప్రసాద్ మాట్లాడుతూ ‘సినిమాకు ఓపెనింగ్ బాగున్నాయి. వందశాతం వసూళ్లు లభిస్తున్నాయి. డాక్టర్ వరుణ్, కాలేజ్ డాన్ చిత్రాలతో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యారు’ అన్నారు.