Don OTT | ఓటీటీలోకి శివకార్తికేయన్ ‘డాన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Don movie on ott | తమిళ హీరో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన కార్తికేయన్ గతేడాది విడుదలైన ‘డాక్టర్’ సినిమాతో టాలీవుడ్లో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈయన నటించిన ‘డాన్’ తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలైంది. సిబి.చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే13న విడుదలై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. పోటీగా ‘సర్కారు వారి పాట’ సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్న డాన్ చిత్రం మంచి కలెక్షన్లను సాధించి ఇటీవలే బ్రేక్ ఈవెన్‌ను కూడా పూర్తి చేసుకుంది. రెండు వరుస విజయాలతో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తాజాగా ఓటీటీ విడుదలకు సిద్దమైంది.
రొమాంటిక్ కామెడీ డ్రామాగా విడుదలైన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’లో జూన్ 10నుంచి స్ట్రీమింగ్ కానునున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ మధ్య కాలంలో ఎంతటి భారీ విజయం సాధించినా సినిమా అయినా సరే కేవలం నెల రోజుల్లోనే ఓటీటీలోకి దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే డాన్ చిత్రం కూడా విడుదలైన 4వారాల్లోనే ఓటీటీలో ప్రదర్శితం కానుంది. అనురుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శివకార్తికేయన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. లైకా ప్రొడక్షన్ సంస్థతో కలిసి శివ కార్తికేయన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

