Chandramohan | చంద్రమోహన్ అసలు పేరేంటో తెలుసా?
ఇండ్రస్ట్రీలో లక్కీ హీరోగా పేరున్న చంద్రమోహన్ (Chandramohan).. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఎందరో నటీమణులు ఆయన సరసన హీరోయిన్లు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర తారలుగా వెలుగొందారు.
Chandramohan | ఇండ్రస్ట్రీలో లక్కీ హీరోగా పేరున్న చంద్రమోహన్ (Chandramohan).. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఎందరో నటీమణులు ఆయన సరసన హీరోయిన్లు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర తారలుగా వెలుగొందారు. దాదాపు 175 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన.. మొత్తంగా 900కుపైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇతకీ ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు.
1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేసిన ఆయన ఇప్పటివరకు ఆయన రెండు ఫిలింఫేర్, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. పదహారెళ్ల వయసు, సిరిసిరి మువ్వ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు, 1987లో చందమామ రావే సినిమాకు ఉత్తమ కమెడీయన్గా నంది అవార్డు, 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

