Animal | ఓటీటీలు వచ్చాక సినిమాలు చేసే కోణమే మారిపోతుంది. థియేటర్లో చూసినప్పుడు స్టోరీ, మేకింగ్, నటనపై మాత్రమే దృష్టిపెట్టే సినీ అభిమానులు.. ఓటీటీలో అయితే ప్రతి సీన్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. సినిమాలో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి? ఏవైనా హిడెన్ డీటైల్స్ ఉన్నాయా వంటి అంశాలను కనిపెట్టి బయటకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఆ మధ్య స్కంధ సినిమా రిలీజైనప్పుడు ఒక ఫైట్ సీన్లో రామ్ పోతినేనికి డూప్‌గా డైరెక్టర్ బోయపాటి కనిపించారు. థియేటర్లో ఈ ఫైట్ సీన్ చూసినప్పుడు పెద్ద తేడా తెలియలేదు కానీ.. ఓటీటీలో పాజ్ చేస్తూ చూసినప్పుడు ఈ విషయం బయటకొచ్చింది. ఇక సలార్ ఓటీటీలో వచ్చినప్పుడు కూడా ఇలాగే.. సినిమా మొత్తంలో ప్రభాస్ ఎన్ని డైలాగులు చెప్పాడో బయటపెట్టాడు. ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ అన్నీ కలిపి ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పుడు యానిమల్ సినిమా విషయంలోనూ ఇలాంటిదే జరిగింది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ మెయిన్ రోల్లో నటించిన యానిమల్ సినిమా ఇటీవల ఓటీటీలో రిలీజయ్యింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను చూసిన పలువురు ఔత్సాహికులు ఒక విషయాన్ని కనుగొన్నారు. ఫాదర్ సెంటిమెంట్‌లో వచ్చిన ఈ సినిమాలో నాన్న ( పాపా ) అనే పదం ఎన్నిసార్లు వచ్చిందనే విషయాన్ని లెక్కబెట్టారు. మొత్తంగా చూస్తే సినిమా మొత్తంలో దాదాపు 196 సార్లు పాపా అనే పదాన్ని పలికినట్లు నెటిజన్లు తెలుసుకున్నారు. ఇందులో ఒక్క రణ్‌బీర్ కపూర్ నోటి నుంచే ఈ పదం 150 సార్లు వచ్చిందంట. ఈ విషయాన్ని కనుగొన్న పలువురు ఔత్సాహికులు.. సినిమాలో ఈ పదం వచ్చే సీన్స్ అన్ని కట్ చేస్తూ ఒక వీడియోను చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
#Animal papa count. pic.twitter.com/ltaaIJzK1l
— LetsCinema (@letscinema) January 27, 2024