Game changer | స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ప్రస్తుతం రాంచరణ్ (Ram Charan)తో గేమ్ ఛేంజర్ (Game changer) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్సీ 15 ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. గేమ్ ఛేంజర్‌లో రాంచరణ్‌తో ఫైట్ చేసే విలన్‌గా ఎవరు కనిపించబోతున్నారనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. తాజా టాక్ ప్రకారం బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు.
తెలుగులో అల్లు అర్జున్ నటించిన బద్రీనాథ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన రామయ్యా వస్తావయ్యాలో మెరిశాడు హ్యారీ జోష్ (Harry Josh). హిందీలో ధూమ్ 2, గోల్మాల్ 3, టార్జాన్ ది వండర్ వార్, కిస్నా, ముసాఫిర్, సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రాలతోపాటు పంజాబీ, కన్నడ, మరాఠీ సినిమాల్లో నటించాడు. హ్యారీ జోష్ గేమ్ ఛేంజర్‌తోపాటు లక్ష్మి మంచు నటిస్తోన్న ఆది పర్వంలో విలన్‌గా నటిస్తున్నాడు.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌లో రాజోలు భామ అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
Jailer | రజినీకాంత్ జైలర్ రిలీజ్ టైం ఫిక్సయినట్టే..
Agent | ఏజెంట్ నుంచి ఊర్వశి రౌటేలా వైల్డ్ సాలా వీడియో సాంగ్