బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం రసవత్తరంగా సాగుతుంది. 50 రోజులకి పైగా సాగిన ఈ షోలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిర్వాహకులు ప్రేక్షకులకి పసందైన వినోదం అందించేందుకు బాగానే కృషి చేస్తున్నారు.దసరా సందర్భంగా మూడు గంటల పాటు ఫుల్ ఎంటర్ టైన్ చేసిన టీం ఇప్పుడు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ కూడా గట్టిగానే ప్లాన్ చేసింది.
ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుండగా, ఈ కార్యక్రమానికి శ్రియ, సుమ, కల్పన, విజయ్ దేవరకొండ , ఆనంద్ దేవరకొండతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరు షోలో తెగ సందడి చేసినట్టు ప్రోమో ద్వారా తెలుస్తుంది. కల్పన కంటస్టెంట్స్ అందరి గురించి సాంగ్ రూపంలో చెబుతోంది.
ఇక సుమ మాట్లాడుతూ.. యాంకరింగ్ చాలా సీరియస్ గా తీసుకొని చేస్తున్నారు అని అనగా, దీనికి నాగ్.. నువ్వు మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టుకొని ఇక్కడకి వచ్చావు అన్నారు. దానికి సుమ వారు నాకు పే చేస్తున్నారు. నాగ్ కూడా నాకు ఇస్తున్నారు అనగా నవ్వులు పూసాయి. ప్రోమో చూస్తుంటే ప్రోగ్రాంలో సందడి నెలకొన్నట్టు తెలుస్తుంది.