‘మజిలీ’ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలో తొలి అడుగు వేసింది దివ్యాంశకౌశిక్. సహజత్వంతో కూడిన నటనతో ప్రతిభను చాటుకున్నది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో చక్కటి అవకాశాన్ని సొంతం చేసుకున్నది. సందీప్‌కిషన్, విజయ్‌సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకుడు. నారాయణ్‌దాస్ నారంగ్ సమర్పణలో భరత్‌చౌదరి, పుస్కూర్రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో దివ్యాంశకౌశిక్ నటించనున్నది. అభినయానికి ఆస్కారమున్న విభిన్నమైన క్యారెక్టర్లో ఆమె కనిపించబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. దర్శకుడు గౌతమ్‌మీనన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.