నవీన్ బేతిగంటి, దివ్యశ్రీపాద నటించిన చిత్రం ‘చరిత కామాక్షి’. చందు సాయి దర్శకత్వంలో రజనీరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘చిరు బిడియం’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. అబూ సంగీతాన్నందించారు. ‘ఈ సినిమాలో దివ్యశ్రీపాద చరిత కామాక్షిగా టైటిల్ రోల్‌ని పోషిస్తున్నారు. ఆమె పాత్ర చిత్రణ నవ్యరీతిలో సాగుతుంది. ఓ విభిన్నమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాకీ వనమాలి, నిర్మాణ సంస్థ: ఫైర్ ఫ్లై ఆర్ట్స్, నిర్మాత: రజినీ రెడ్డి, దర్శకుడు: చందుసాయి.