Anaganaga Oka Raju | టాలీవుడ్ యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి కానుకగా బుధవారం థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా కలిసి తన అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా హీరో నవీన్ పొలిశెట్టి నటనను ప్రశంసిస్తూ ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం టీమ్ సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసి సినిమా విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక వీడియోను నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.