వైవిధ్యమైన ప్రేమకథలని వెండితెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు తేజది ప్రత్యేకశైలి. కొంత విరామం తరువాత ఆయన దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అహింస’. నిర్మాత సురేష్‌బాబు తనయుడు అభిరామ్ ఈ చిత్రం ద్వారా హీరోగా అరంగ్రేటం చేస్తున్నాడు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు తేజతో జరిపిన ఇంటర్వ్యూ ఇది.
సినీ నేపథ్యం వున్న కుటుంబంలోని వ్యక్తులతో సినిమా చేసినప్పుడు సహజంగానే అంచనాలు, పోలికలు వస్తుంటాయి. ప్రతీది భూతద్దంలో పెట్టి చూస్తారు. అభిరామ్ కొత్తగా వచ్చాడు. కొత్తవారిలో బెరుకు, భయాలు సహజంగా వుంటాయి. ఇక వారసత్వ హీరో కాబట్టి ఇంకాస్త ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే ఆల్రెడీ స్టార్స్ అయిన వెంకటేష్, రానాలతో పోలిక పెట్టి మాత్రం అభిని చూడకూడదు.
అలా ఏమీ వుండదు. ప్రేక్షకులు చాలా తెలివైన వారు. ట్రైలర్ చూసిన తరువాత సినిమాకి వెళ్ళాలా? వద్దా? అనేది డిసైడ్ అయిపోతారు. స్టార్‌ని బట్టి వెళితే అసలు పెద్దస్టార్స్కి అపజయాలే రాకూడదు కదా.. సినిమాలో ఎమోషన్ వుంటే ట్రైలర్లో కూడా ఆ ఎమోషన్ వుంటుంది. ప్రేక్షకులు ఆ ఎమోషన్‌కి కనెక్ట్ అయితే స్టార్ సినిమానా? కొత్తవారిదా? అనే తేడా లేకుండా వచ్చేస్తారు. ఎమోషన్ కనెక్ట్ అయితే ఎవరి సినిమా విజయాన్ని ఆపలేం.
రామానాయుడు గారికి మాట ఇచ్చాను. ఆ మాట కోసమే చేశాను
పెద్దస్టార్స్తో ఎక్కువ డబ్బుల కోసం, ఎక్కువ పేరు కోసం చేయాలి. నేను డబ్బులు, పేరు అన్ని చూశాను. ఓ కెమెరామెన్ దగ్గర డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా పనిచేసేవాడిని.ఫుట్‌పాత్ నుంచి వచ్చిన నాకు ఆయన బ్రేక్ ఇచ్చారు. నాలా చాలా మంది వున్నారు. చాలా ప్రతిభ వుండి కూడా సినీ రంగంలోకి ఎలా ప్రవేశించాలో వారికి తెలియదు. వాళ్లకి నేను బ్రేక్ ఇస్తాను. నన్నెవరూ మార్చలేరు. ఓ పెద్దస్టార్‌తో సినిమా తీసినా అందులో కొత్తవారిని పెడతాను.
రాక్షసరాజు అనే టైటిల్ అనుకుంటున్నా. పాలిటిక్స్, క్రైమ్ నేపథ్యంలో వుంటుంది. గాడ్‌ఫాదర్ తరహా సినిమా. ఆచంట గోపినాథ్ నిర్మాత. జూన్ 6న రామానాయుడు గారి పుట్టిన రోజున స్టార్ట్ చేద్దామని రానా చెప్పారు.