ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ఫేం స్వరూప్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే ‘బ్యాడ్ యాజ్’, ‘కోహినూర్’ సినిమాలైతే స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. ‘టిల్లు క్యూబ్’ కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ మూడూ సినిమాలూ సితార ఎంటర్టైన్మెంట్సే నిర్మిస్తుండటం విశేషం. ఇదిలావుంటే.. ఇవిగాక మరో సినిమా కూడా సిద్ధు డైరీలో చేరినట్టు విశ్వసనీయ సమాచారం.
శ్రీవిష్ణుతో ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాలను తెరకెక్కించిన హసిత్ గోలీ దర్శకత్వంలో సిద్ధు ఓ చిత్రం చేయనున్నారట. ఇటీవలే సిద్ధుకీ హసిత్ ఓ వినోదాత్మక కథను వినిపించాడట. సిద్ధుకి కథ నచ్చిందట. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తారని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ కాంబోకు చెందిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.