Surender reddy | అఖిల్ ‘ఏజెంట్’ తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి (Surender reddy). పవన్ కళ్యాణ్ (Pawankalyan), సురేందర్ రెడ్డి, రామ్ తాళ్లూరి ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ లో ఓ సినిమా ఖరారైయింది. ఇటీవలే ఈ చిత్రం ఆఫీస్ ఓపెనింగ్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు సురేందర్ రెడ్డి లైనప్ మారింది. పవన్ కళ్యాణ్ సినిమా కంటే ముందు ఆయన వెంకటేష్ (Venkatesh) హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు. భూపతిరాజా ఈ చిత్రానికి కథ అందించనున్నారు.
ప్రస్తుతం స్క్రిప్టింగ్ పనులు జరుగుతున్నాయి. వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ సినిమా ఉండబోతుంది. నిజానికి సురేందర్ రెడ్డి ముందు పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేయాలి. కానీ పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు వున్నాయి. అలాగే అటు ఏపీలో ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఇప్పుడు సెట్స్ పై వున్న సినిమాలు పూర్తి చేసి తర్వాత పవన్ ఎలక్షన్స్ లో బిజీ కానున్నారు. ఈ గ్యాప్ లో వెంకటేష్ తో సినిమా పూర్తి చేయబోతున్నారు సురేందర్ రెడ్డి. ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘సైంధవ్’ సంక్రాంతి విడుదలకు రెడీ అవుతోంది.