Ayyo Emi Ra Ee Jeevitham | ‘బకాసుర రెస్టారెంట్’ నుంచి ‘అయ్యో ఏమీరా ఈ జీవితం’ పాటను ఆవిష్కరించిన హరీశ్ శంకర్
Bakasura Restaurant | యువ దర్శకుడు ఎస్జే శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్నతాజా చిత్రం 'బకాసుర రెస్టారెంట్'. ఈ సినిమాలో నటుడు ప్రవీణ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, వైవా హర్ష టైటిల్ రోల్లో నటిస్తున్నారు.
Bakasura Restaurant | యువ దర్శకుడు ఎస్జే శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్నతాజా చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఈ సినిమాలో నటుడు ప్రవీణ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, వైవా హర్ష టైటిల్ రోల్లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఎస్జే మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ హంగర్ కామెడీ ఎంటర్టైనర్ ట్రైలర్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది. తాజాగా, ఈ చిత్రం నుంచి ‘అయ్యో ఏమీరా ఈ జీవితం’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను బ్లాక్‌బస్టర్ మాస్ దర్శకుడు హరీశ్ శంకర్ విడుదల చేశారు. వికాస బడిస సంగీతం అందించిన ఈ పాటను ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఎస్జే శివ మాట్లాడుతూ.. ఇదొక యూత్‌ఫుల్ సాంగ్. రాహుల్ సిప్లిగంజ్ తన గానంతో ఈ పాటకు మరింత వన్నె తెచ్చారు. వికాస బడిస స్వరాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు థ్రిల్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది. అతి త్వరలో చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాం అని అన్నారు.
నటీనటులు: ప్రవీణ్, వైవా హర్ష, షైనింగ్ ఫణి (బమ్చిక్ బంటి), కేజీఎఫ్ గరుడ రామ్, కృష్ణభగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఉప్పెన జయకృష్ణ, వివేక్ దండు, అమర్, రామ్‌పటాస్, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్, జబర్థస్త్ అప్పారావు తదితరులు.
సాంకేతిక నిపుణులు:
డీఓపీ: బాల సరస్వతి
ఎడిటర్: మార్తండ్.కె.వెంకటేష్
సంగీతం: వికాస్ బడిస
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్ కొట్టి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్ తంగాల
పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు
నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి
దర్శకత్వం: ఎస్జే శివ
Read More
-
Nakrekal : కళ్లల్లో కారం కొట్టి.. పారతో శరీరాన్ని చెక్కి.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
-
TG EdCET | టీజీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల.. 96.38 శాతం ఉత్తీర్ణత నమోదు
-
Kaalidhar Laapata | ఎమోషనల్‌గా అభిషేక్ బచ్చన్ ‘కాళిధర్ లపతా’ ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

