‘గేమ్ ఆన్’ చిత్రం రియలిస్టిక్‌గా ఉంటుందని, సైకలాజికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని చెప్పారు దర్శకుడు దయానంద్. ఆయన నిర్ధేశకత్వంలో గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ ‘పాఠశాల రోజుల నుంచే నాకు సినిమాల మీద ఆసక్తి ఉంది. హ్యాపీడేస్, ఏ మాయ చేసావే సినిమాలు చూసిన తర్వాత దర్శకత్వం మీద అభిరుచి ఏర్పడింది.
చనిపోదామనుకున్న వ్యక్తి అనుకోకుండా ఓ గేమ్ ఆడాల్సి వస్తే అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ చిత్ర కథాంశం. తొమ్మిది టాస్క్‌లు దాటుకుంటూ వెళ్లిన అతను చివరకు ఎలాంటి ఫలితం పొందాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. మధుబాల, ఆదిత్యామీనన్ పాత్రలు కీలంగా ఉంటాయి. హీరో గీతానంద్ పాత్రలో చాలా షేడ్స్ కనిపిస్తాయి. కథానాయిక నేహా సోలంకి పాత్రలో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయి. సైకలాజికల్ కాన్సెప్ట్‌తో రియలిస్టిక్‌గా ఈ సినిమాను తెరకెక్కించాం. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా నచ్చుతుంది’ అన్నారు.