Buchi Babu | ఉప్పెన సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు యువ దర్శకుడు బుచ్చిబాబు సాన (Buchi Babu). ఈ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బుచ్చి బాబు ఎలాంటి సినిమా చేయబోతున్నాడంటూ మూవీ లవర్స్ తెగ చర్చించుకుంటుండగా.. ఎవరూ ఊహించని విధంగా రాంచరణ్ (Ram Charan)తో రెండో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తాజాగా చాలా కాలం తర్వాత మెగా అభిమానులకు సెల్ఫీ రూపంలో అప్డేట్ అందించాడు.
రాంచరణ్‌తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. గ్లోబల్ స్టార్ రాంచరణ్‌తో ఉత్సాహకరమైన సమయం ముందుంది.. అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను చూసిన అభిమానులను ఆనందంలో మునిగిపోతూ.. రాంచరణ్‌ను మాస్ అవతార్‌లో చూపించాలని కోరుతున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. రాంచరణ్‌కు ఇది 16 (RC 16)వ సినిమా కానుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లో కనిపించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.
ప్రస్తుతం ఆర్సీ 15గా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు రాంచరణ్. శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత బుచ్చిబాబుతో చేయబోయే ఆర్సీ 16పై ఫోకస్ పెట్టబోతున్నట్టు తాజా సెల్ఫీతో అర్థమవుతోంది.
Exciting times ahead!!!!
With our Global Star… @AlwaysRamCharan garu ❤️ pic.twitter.com/dC4HmDblSP
— BuchiBabuSana (@BuchiBabuSana) May 24, 2023