Ram Charan | క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్. చాలా సినిమాల విషయంలో ఇది నిరూపణ అయ్యింది కూడా. ఉదాహరణకు ‘రంగస్థలం’. సినిమా బాగుంటుంది.. క్లైమాక్స్ అయితే నెక్ట్స్ లెవల్. ఇక ‘ఉప్పెన’ సరేసరి. క్లైమాక్స్ కోసమే ఆడిందా సినిమా. అందుకే.. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో చేస్తున్న ‘పెద్ది’(వర్కింగ్ టైటిల్) సినిమాకు సంబంధించిన ైక్లెమాక్స్ని నెవర్ బిఫోర్ అనే రేంజ్లో రాసుకున్నాడట దర్శకుడు బుచ్చిబాబు సాన.
ఆడియన్స్‌ని మళ్లీ మళ్లీ ఈ క్లైమాక్స్ థియేటర్లకు రప్పిస్తుందని ఇన్ సైడ్ టాక్. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయిక. రెహమాన్ సంగీత దర్శకుడు. ‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌కు సరిగ్గా వినపడదు. అలాగే పెద్దిలో కూడా రామ్చరణ్పాత్రకు ఓ లోపం ఉంటుందట. దానితో నడిపించిన డ్రామా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్.