Dil Raju | తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు (Dil Raju) తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కల్పించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయనను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యార్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు (Dil Raju) తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కల్పించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయనను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యార్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.
దిల్ రాజు అసలు పేరు వెంకటరమణా రెడ్డి. 1990లో పెళ్లి పందిరి సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా చిన్ని చిత్రాలు కూడా నిర్మిస్తూ అనేకమందికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్నవారిని ప్రోత్సహించేందుకు గాను దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభిస్తున్నానని ఇటీవలే ప్రకటించారు. దీనికోసం ఒక వెబ్‌సైట్‌ను కూడా లాంచ్ చేయనున్నారు.
ఆయన ప్రస్తుతం మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అగ్రదర్శకుడు శంకర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో ఆయన నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ జనవరి 10న, వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న విడుదల కానున్నాయి. వీటితోపాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

