Dhurandher 1 | గత ఏడాది ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘ధురంధర్ 1’ ఇప్పుడు మరో పెద్ద మార్కెట్‌పై కన్నేసింది. రణ్వీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. పార్ట్ 1గా రూ.1300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, సింగిల్ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో ఒకటిగా ‘ధురంధర్ 1’ నిలిచింది. యాక్షన్, ఎమోషన్, టెక్నికల్ వాల్యూస్ కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. జూలై 10న అక్కడ గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారతీయ సినిమాలకు జపాన్ మార్కెట్లో మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. గతంలో కొన్ని సినిమాలు అక్కడ ఎక్కువ కాలం ప్రదర్శింపబడి మంచి వసూళ్లు సాధించాయి.
ఈ నేపథ్యంలో ‘ధురంధర్ 1’ కూడా జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అక్కడ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా యాక్షన్ ఎలిమెంట్స్, విజువల్ గ్రాండియర్ జపాన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఈ సినిమా లాంగ్ రన్ సాధించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా, జపాన్‌లో మొదటి భాగం విజయం సాధిస్తే ‘ధురంధర్ 2’ను కూడా అక్కడ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉండటంతో, అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫ్రాంచైజ్ మరింత విస్తరించే అవకాశం కనిపిస్తోంది.
భారతదేశంలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ధురంధర్ 1’ ఇప్పుడు జపాన్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అక్కడి ఫలితాలు ఈ చిత్రానికి గ్లోబల్ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావచ్చు. ఇక ధురంధర్ 1కి సీక్వెల్‌గా వచ్చిన ధురంధర్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీ బాహుబలి 2 రికార్డులు కూడా బ్రేక్ చేసింది.