RC 17 | టాలీవుడ్లో సుకుమార్ (Sukumar)-రాంచరణ్ (Ramcharan)కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిందని తెలిసిందే. ఈ క్రేజీ కాంబోలో మరోసారి ఆర్సీ 17(RC17) సందడి చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రం కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్ పేరును పరిశీలిస్తున్నట్టు ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ అతడెవరో తెలుసా..? ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ శశ్వత్ సచ్దేవ్. రాంచరణ్ నిర్మాతగా నిఖిల్ హీరోగా నటిస్తోన్న ఇండియా హౌస్ చిత్రానికి కూడా శశ్వత్ సచ్దేవ్ సంగీతం అందిస్తున్నాడు. ఇదే నిజమైతే ఆర్సీ 17పై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయమైనట్టే. మరి రాబోయే రోజుల్లో రాంచరణ్-సుకుమార్ టీం నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
రాంచరణ్ ప్రస్తుతం పెద్ది (Peddi) సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా గా వస్తోన్న ఈ చిత్రానికి ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పెద్ది ఏప్రిల్ 30న 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీలో జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పెద్ది చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
Dhurandhar music director Shashwat Sachdev is in talks for the #RC17
he is also the music director for #IndiaHouse which is produced by Ram Charan
— Sanjay.D.Luffy (@Sanjayred9y) March 30, 2026
Nithiin | లీడింగ్ బ్యానర్లో నితిన్ కొత్త సినిమా.. ఈసారైనా హిట్టు పడేనా..?
Hardik Pandya: మహికా శర్మకు 1.7 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా