Dhanush New Movie | తమిళ స్టార్ నటుడు ధనుష్ 55వ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. D55గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి ‘OM’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ, మేకర్స్ ‘OM First Strike’ పేరుతో అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు. దట్టమైన అడవులు, కొండల నడుమ సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ గ్లింప్స్ కట్ చేశారు. అమాయక గిరిజనులను సాయుధ బలగాలు చుట్టుముట్టగా, భయంతో ఉన్న వారంతా ఒక్కసారిగా “అణ్ణా మలైయార్కు!” అని నినదించే సీన్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఆ వెంటనే వర్షం, పొగమంచు మధ్య చేతిలో తుపాకితో ధనుష్ వయలెంట్ అవతారంలో ఎంట్రీ ఇస్తాడు. తుపాకులు పట్టుకున్న బలగాలతో ఒంటిచేత్తో తలపడే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి.
ఈ చిత్రాన్ని మేకర్స్ మల్టీ-పార్ట్ సిరీస్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొదటి భాగాన్ని “Chapter 1: Udhiram – The Blood Wood పేరుతో తీసుకొస్తున్నారు. ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ‘OM’పై భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి, యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఫస్ట్ స్ట్రైక్‌లో కేవలం ధనుష్ యాక్షన్ పోర్షన్ మాత్రమే చూపించి, మమ్ముట్టి, సాయి పల్లవి లుక్స్‌ను సస్పెన్స్‌గా ఉంచారు. సాయి పల్లవి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుందని టాక్. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు ప్రాణం పోసింది. వండర్‌బార్ ఫిలింస్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గ్లింప్స్‌తో పాటే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. ‘OM’ చిత్రం 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.