Dhanush | మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంటోంది. ముఖ్యంగా సినిమాలోని కథ, భావోద్వేగ సన్నివేశాలు, నటీనటుల ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో రవితేజ నటనతో పాటు ఆయన కుమార్తె పాత్రలో నటించిన బాలనటి బేబీ నక్షత్ర నటనకు విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని తెరపై ఎంతో భావోద్వేగంగా చూపించడంలో ఈ ఇద్దరి నటన కీలక పాత్ర పోషించిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
‘ఇరుముడి’ సక్సెస్ మీట్ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ బేబీ నక్షత్రకు ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చారు. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు ధనుష్‌తో నక్షత్రకు వీడియో కాల్ ఏర్పాటు చేశారు. సినిమాలో ఆమె నటనను చూసిన ధనుష్ చిన్నారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ వీడియో కాల్లో ధనుష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నక్షత్ర నటనను ప్రశంసిస్తూ, ఎప్పుడైనా ఇద్దరం కలిసినప్పుడు “నేను నీ దగ్గర నటన నేర్చుకోవాలి” అంటూ సరదాగా చెప్పారు.. ఒక స్టార్ హీరో, జాతీయ అవార్డు విజేత నుంచి ఇలాంటి ప్రశంసలు రావడంతో నక్షత్ర ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ధనుష్‌తో జరిగిన ఈ ప్రత్యేక సంభాషణను బేబీ నక్షత్ర తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించి వైరల్‌గా మారింది. చిన్నారి నటనకు ధనుష్ లాంటి స్టార్ నుంచి ప్రశంసలు రావడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇరుముడిలో నక్షత్ర నటన నిజంగానే అద్భుతం , ధనుష్ ప్రశంసలు ఆమెకు మరింత ప్రోత్సాహం ఇస్తాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బేబీ నక్షత్ర పాత్ర కథలో కీలకంగా నిలిచిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా రవితేజతో ఆమెకు ఉన్న సన్నివేశాలు సినిమాకు ఎమోషనల్ బలం ఇచ్చాయని ప్రశంసలు వస్తున్నాయి. తండ్రి-కూతుళ్ల అనుబంధాన్ని తెరపై సహజంగా పండించడంలో నక్షత్ర నటన ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది.