Kuberaa | టాలీవుడ్ క్లాసిక్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేర (Kuberaa). తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మల్టీ లింగ్వెల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి ట్రాన్స్ ఆఫ్ కుబేరా అంటూ టీజర్‌ను వదిలారు మేకర్స్. నాది నాది నాది అంటూ పాటతో సాగిన ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది.
ఈ టీజర్ చూస్తుంటే.. ధనుష్ ఈ సినిమాలో ఇదివరకెన్నడూ చేయని సరికొత్త పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. నాగార్జున కూడా సాలిడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టీజర్లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన స్కోర్ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.