Raayan Movie | ఈ ఏడాది సంక్రాంతికి ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు కోలీవుడ్ నటుడు ధనుష్ (Dhanush). ఈ సినిమా అనంతరం తన 50వ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. రాయన్ (Raayan) అని ఈ సినిమాకు టైటిల్ పెట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్‌లో ధనుష్ మాంసం అమ్మేవాడి (butcher) పాత్రలో కనిపించబోతున్నాడు. సందీప్ కిషన్‌తో పాటు కాళిదాస్ జయరాం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఎ. ఆర్. రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో 2024లోనే విడుదల కానుంది. హీరోయిన్, ఇతర టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.
#D50 is #Raayan 🔥
🎬 Written & Directed by @dhanushkraja
🎵 Music by @arrahmanReleasing in Telugu | Tamil | Hindi@omdop @editor_prasanna @kalidas700 @sundeepkishan @PeterHeinOffl @jacki_art @kavya_sriram @kabilanchelliah @theSreyas @RIAZtheboss #D50FirstLook pic.twitter.com/m2KjsfeFt0
— Gemini TV (@GeminiTV) February 19, 2024